breaking news
plants purchase
-
హార్ట్ ఫేవరెట్.. హార్టికల్చర్ షో : రూ.30 నుంచి 3 లక్షల దాకా!
నగర వేదికగా ప్రకృతి ప్రేమికుల హార్ట్ ఫేవరెట్ అయిన హారి్టకల్చర్ షో మరో మారు అలరిస్తుంది. నక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఈ 18వ నర్సరీ మేళా–2025 గురువారం గ్రాండ్‌గా ప్రారంభించారు. ఇందులో వివిధ రకాల మొక్కలు రూ.30 నుంచి రూ.3 లక్షల ధరల్లో గార్డెనింగ్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నగరవాసులకు అందుబాటులో ఉండనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. – ఖైరతాబాద్/లక్డీకాపూల్ రాష్ట్ర ఉద్యానవన శాఖ టెర్రస్ గార్డెన్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా గ్రీనరీ ప్రియులను దృష్టిలో పెట్టుకుని నర్సరీ మేళా పేరుతో ఆల్ ఇండియా హారి్టకల్చర్ షో అందుబాటులోకి తీసుకొచ్చింది. భిన్న రకాల మొక్కలు, విభిన్న రకాల పుష్పజాతులు, ఔషధ, అరుదైన మొక్కలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి అరుదైన మొక్కలు, విత్తనాలు తీసుకొచ్చి 150 స్టాళ్లలో ఏర్పాటు చేశారు. కిచెన్, అవుట్డోర్, బల్బ్, సీడ్, సీడ్లింగ్స్, ఇండోర్, ఆడినియం, బోన్సాయ్, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్ ప్లాంట్స్‌తో పాటు ఎగ్జాటిక్ ప్లాంట్స్, వాటర్ లిల్లీస్, కోకో పీట్, గార్డెన్ ఎక్విప్మెంట్, ఫామ్ ఎక్విప్మెంట్ వంటి ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!ఎగ్జాటిక్ ప్లాంట్స్ ప్రత్యేకం.. నర్సరీ మేళాలో వెస్ట్ బెంగాల్‌లోని కాలీపంగ్ నుంచి ప్రత్యేక ఎగ్జాటిక్ ప్లాంట్స్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ప్రదర్శన ఇన్‌ఛార్జి ఖాలీద్ అహ్మద్ పేర్కొంటున్నారు. ఈ మేళాలో ఏపీ, కడియం, కోల్‌కతా, ఢిల్లీ, హర్యాణ, ముంబై, బెంగళూరు, పుణె, చెన్నై, వెస్ట్ బెంగాల్ తదితర ప్రాంతాల నర్సరీలు భాగస్వామ్యం అయ్యాయి. నాటు కూరగాయలు, బొబ్పాయి, మునగ మొక్కలతో స్నేహ నర్సరీ ఆకట్టుకుంటోంది. తెలుగు రాష్ట్రాల వాతావరణానికి అనుకూలమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయి. -
హ్యుందాయ్ చేతికి జీఎం ప్లాంట్.. కొత్త వ్యూహాలు సిద్ధం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యుందాయ్ మోటార్ ఇండియా.. మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఉన్న జనరల్ మోటార్స్ (జీఎం) ఇండియాకు చెందిన తాలేగావ్ ప్లాంటును కొనుగోలు చేయనుంది. డీల్ పూర్తయితే స్థలం, భవనాలు, యంత్రాలు హ్యుందాయ్ పరం కానున్నాయి. ఇందుకోసం జీఎం ఇండియాతో టెర్మ్ షీట్ ఒప్పందం చేసుకున్నట్టు దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ సోమవారం ప్రకటించింది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. ప్లాంటు చేతికి వచ్చిన తర్వాత తొలుత వెన్యూ ఎస్‌యూవీని ఈ కేంద్రంలో తయారు చేసి ఎగుమతి చేయాలన్నది హ్యుందాయ్ ఆలోచన. 2028 నాటికి భారత్‌లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హ్యుందాయ్ ఇప్పటికే ప్రకటించింది. అలాగే 6 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. చెన్నై సమీపంలోని శ్రీపెరుంబుదూరు వద్ద ఉన్న హ్యుందాయ్ ప్లాంటు దాదాపు పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది. భారత్‌తోపాటు విదేశాల నుంచి కంపెనీ కార్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అదనపు తయారీ సామర్థ్యం ఇప్పుడు సంస్థకు తప్పనిసరి. -
నాలుగు ఆకుల కోసం రూ. 4 లక్షలు
వెలింగ్టన్: ఉదాహరణకు మన దగ్గర ఓ నాలుగు లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి.. ఏం చేస్తాం. కారు తీసుకుంటాం.. లేదా తక్కువకు దొరికితే ల్యాండ్ తీసుకుంటాం.. అది కాదంటే విహారయాత్రకు వెళ్తాం. జాగ్రత్తపరులైతే.. బ్యాంకులో ఫిక్స్డ్ చేస్తారు. అంతేకానీ ఆ మొత్తం డబ్బుతో మొక్కలను మాత్రం కొనం. అది కూడా కేవలం నాలుగంటే నాలుగే ఆకులున్న మొక్కను అస్సలే కొనం. కానీ న్యూజిలాండ్‌కు చెందిన ఓ అజ్ఞాత వ్యక్తి మాత్రం నాలుగు ఆకులున్న ఓ అరుదైన జాతి మొక్కను అక్షరాల నాలుగు లక్షలు చెల్లించి కొన్నాడు. వినడానికి కాస్తా విడ్డూరంగా ఉన్నా ఇది మాత్రం వాస్తవం. మరి అంత ఖరీదైన ఆ మొక్క కథేంటో చూడండి. ప్రత్యేకమైన రంగు ఉండే అరుదైన జాతి ఫిలోడెండ్రాన్ మినిమా మొక్కను ఒక దాన్ని న్యూజిలాండ్‌కు చెందిన ఈ కామర్స్ వెబ్సైట్ ‘ట్రేడ్ మి’ వేలానికి ఉంచింది. ఈ నేపథ్యంలో ఈ మొక్క కోసం ఏకంగా చిన్నపాటి యుద్ధమే జరగింది. చివరకు ఓ అజ్ఞాత వ్యక్తి దానికి నాలుగు లక్షల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. అనంతరం ఆ మొక్క ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ మొక్కలోని నాలుగు ఆకులు అద్భుతమైన పసుపు రంగులో ఆకర్షణీయంగా ఉన్నాయంటూ సంతోషాన్ని పంచుకున్నాడు. రంగులేని మొక్కల కంటే రంగురంగుల మొక్కలు చాలా అరుదుగా, నెమ్మదిగా పెరుగుతాయని న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఇవి చాలా అరుదుగా సహజంగా సంభవిస్తాయి కనుక వీటిని ఎక్కువగా ఉద్యాన శాస్త్రవేత్తలు, కలెక్టర్లు కోరుకుంటారని తెలిపారు. (చదవండి: ముక్కులో ఇరుక్కున్న చెయ్యి: రెండేళ్ల తర్వాత..) ‘ఈ మొక్కలోని ఆకుపచ్చ రంగు సాధారణంగా ఇతర చెట్లల్లో కిరణజన్య సంయోగక్రియను అనుమతిస్తుంది. అంతేకాక దీని కాండం మీద కొత్త ఆకులు వస్తాయనే హామీ ఇవ్వలేము’ అన్నారు శాస్త్రవేత్తలు. ‘ఈ మొక్క కోసం ఇంత డబ్బు ఖర్చు చేసిన వ్యక్తి దాని విలువ పూర్తిగా తెలిసే ఉంటుంది. భవిష్యత్తులో వీటిని ప్రచారం చేయడానికి, అమ్మి లాభాలు పొందడానికి ఇప్పుడు ఇంత భారీగా వెచ్చించాడని మా అభిప్రాయం అన్నారు’ శాస్త్రవేత్తలు. ఇక ఆ అజ్ఞాత కొనుగోలుదారుడు రేడియో న్యూజిలాండ్‌తో మాట్లాడుతూ ‘ఉష్ణమండల స్వర్గం’ కోసం ఈ మొక్కను సొంతం చేసుకున్నట్లు తెలిపాడు. -
సాల్కాంప్ చేతికి నోకియా చెన్నై ప్లాంటు
న్యూఢిల్లీ: ఒకప్పటి మొబైల్స్ దిగ్గజం నోకియాకు చెందిన చెన్నై ప్లాంటును మొబైల్ చార్జర్ల తయారీ సంస్థ సాల్కాంప్ కొనుగోలు చేయనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కుదిరినట్లు ఆయన సోమవారం తెలిపారు. దాదాపు పదేళ్లుగా మూతబడి ఉన్న ఈ ఫ్యాక్టరీని సాల్కాంప్ పునరుద్ధరించనున్నట్లు, 2020 మార్చి నుంచి ఈ ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి చెప్పారు. ‘నోకియాకు సంబంధించిన అతి పెద్ద సెజ్ దాదాపు 10 ఏళ్లుగా మూతబడి ఉంది. ఈ డీల్‌తో అది మళ్లీ ప్రాణం పోసుకోనుంది. ఈ ప్లాంటులో చార్జర్లు, ఇతర పరికరాల ఉత్పత్తి జరుగుతుంది. సెజ్ నుంచి 70 శాతం ఉత్పత్తులు ఎగుమతి కానున్నాయి. ఎక్కువగా చైనాకు ఎగుమతి ఉంటుంది. దీని ద్వారా అయిదేళ్లలో రూ. 2,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దాదాపు 10,000 మందికి ప్రత్యక్షంగాను, సుమారు 50,000 మందికి పరోక్షంగాను ఉపాధి అవకాశాలు లభించనున్నాయి‘ అని ఆయన తెలిపారు. మొబైల్ చార్జర్ల తయారీలో సాల్కాంప్ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ. ఐఫోన్లకు అవసరమైన చార్జర్లను టెక్ దిగ్గజం యాపిల్‌కు సరఫరా చేస్తోంది. మేకిన్ ఇండియా ఐఫోన్ ఎక్స్ఆర్.. మరోవైపు, యాపిల్ తాజాగా ఐఫోన్ ఎక్స్ఆర్ మొబైల్స్‌ను భారత్‌లోనే తయారు చేయడం ప్రారంభించినట్లు రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. దేశీయంగా విక్రయించడంతో పాటు ఎగుమతుల కోసం వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఇది మరింత ఊతమివ్వనున్నట్లు వివరించారు. ‘ఇది భారత్ గర్వించతగ్గ సందర్భం. ఇప్పటిదాకా ఐఫోన్ బాక్స్‌లపై డిజైన్డ్ ఇన్ కాలిఫోర్నియా, అసెంబుల్డ్ ఇన్ చైనా అని ఉంటోంది. ఇక నుంచి అసెంబుల్డ్ ఇన్ ఇండియా అనే కాకుండా భారత్‌లోనే తయారీ, మార్కెటింగ్ అని కూడా కనిపించనుంది‘ అని చెప్పారు. తైవాన్ కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ సంస్థ విస్ట్రన్ ద్వారా యాపిల్ ప్రస్తుతం ఐఫోన్ 6ఎస్, 7లను భారత్‌లో తయారు చేస్తోంది. మేకిన్ ఇండియా నినాదానికి ప్రభుత్వ ఊతంతో.. 2019–20లో మొబైల్స్, విడిభాగాల ఎగుమతులు తలో 1.6 బిలియన్ డాలర్ల స్థాయిని దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
రా.. రమ్మని..!


