డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు.
'తలసానిపై క్రిమినల్ కేసు పెట్టాలి'
Dec 10 2016 3:20 PM | Updated on Aug 29 2018 8:20 PM
హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. నగరంలోని ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని తాను చేసిన ఫిర్యాదు పై కలెక్టర్ విచారణ జరిపించగా.. అందులో అక్రమాలు జరిగిన విషయం నిజమని తేలిందన్నారు.
శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి తలసాని ప్రోద్బలంతోనే ఈ అక్రమాలు జరిగాయని.. వాటిని ప్రోత్సహించిన తలసానిపై క్రిమినల్ కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement