మాజీ ఎమ్మెల్యేను చంపిన మావోయిస్టులు | Maoists killed a former legislator | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యేను చంపిన మావోయిస్టులు

Apr 14 2016 6:38 PM | Updated on Oct 9 2018 2:51 PM

అంబెద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు కాల్చి చంపారు.

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. అంబెద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు కాల్చి చంపారు. గడ్చిరోలి జిల్లా అయిర తాలుక రేషన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చల్లవాడ గ్రామంలో జరుగుతున్న అంబెద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే దీపక్ అత్రంను మారువేషాల్లో వచ్చిన మావోయిస్టులు కాల్చిచంపారు.

 

దీపక్ అత్రం ఆదివాసి విద్యార్థి సంఘం తరఫున ఇండిపెండెంట్‌గా విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినందుకు గాను మావోయిస్టులు ఈ ఘతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement