నా భార్యను మీ మాజీ ఎమ్మెల్యే తీసుకెళ్లాడు..! | Karnataka Row, Man Alleges Former MLA Affair With His Wife, Moves Complaint To Union Minister, Demands Action | Sakshi
Sakshi News home page

నా భార్యను మీ మాజీ ఎమ్మెల్యే తీసుకెళ్లాడు..!

Apr 7 2026 12:00 PM | Updated on Apr 7 2026 1:50 PM

Former MLA Annadani Allegations of Affair

కర్ణాటక: మండ్యలో జేడీఎస్‌ మాజీ ఎమ్మెల్యే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆమెకు మైసూరులో కోటిన్నర రూపాయల విలువైన అపార్ట్‌మెంట్‌ ఫ్లాటును ఇచ్చాడని ప్రసన్న అనే వ్యక్తి కేంద్ర మంత్రి హెచ్‌.డి. కుమారస్వామికి ఫిర్యాదు చేశాడు. ఆ మాజీ ఎమ్మెల్యే రాత్రి పూట మాత్రమే ఫ్లాటుకు వెళ్తారని, రోజూ గంటల తరబడి భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడని ఆరోపించాడు.

పలువురు పెద్దలకు ఫిర్యాదు చేసినప్పటికీ తనకు న్యాయం జరగలేదని, పైగా తనపై పరువు నష్టం కేసు పెట్టారని వాపోయాడు. విడాకులు ఇవ్వమని నా భార్యను అడిగాను, కానీ, రూ.30 లక్షలు ఇస్తే విడాకులు ఇస్తానని ఆమె చెప్పింది. నా భార్య వేరొకరితో ఉంటే నేను ఎలా సహిస్తాను అని బాధితుడు ప్రశ్నించాడు. వారి బాగోతాలకు చెందిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నట్లు ఆయన చెప్పాడు. కుమారన్న నాకు న్యాయం చేస్తానని చెప్పాడని తెలిపాడు. ఈ తగవును కుమార ఎలా పరిష్కరిస్తారోనని స్థానికులు కుతూహలం వ్యక్తం చేశారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement