మైలార్‌దేవ్‌పల్లిలో వ్యక్తి దారుణ హత్య | man brutally murdered by unknown people in hyderabad | Sakshi
Sakshi News home page

మైలార్‌దేవ్‌పల్లిలో వ్యక్తి దారుణ హత్య

Aug 6 2016 1:08 PM | Updated on Sep 4 2017 8:09 AM

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పద్మశాలిపురంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పద్మశాలిపురంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక వాటర్ ట్యాంక్ సమీపంలో శుక్రవారం రాత్రి 35 ఏళ్ల వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అయితే అతడు చికిత్స పొందుతూ.... శనివారం ఉదయం మరణించాడు. మృతుడి గొంతు కోసి, ముఖం గుర్తు పట్టలేనట్లుగా ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement