ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్ నియామకం | Karne Prabhakar Appointed as MLC | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్ నియామకం

Aug 18 2014 7:57 PM | Updated on Sep 2 2017 12:04 PM

కర్నె ప్రభాకర్‌

కర్నె ప్రభాకర్‌

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న కర్నె ప్రభాకర్‌ను తెలంగాణ శాసన మండలి సభ్యుని(ఎమ్మెల్సీ)గా నియమించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న కర్నె ప్రభాకర్‌ను తెలంగాణ శాసన మండలి సభ్యుని(ఎమ్మెల్సీ)గా నియమించారు. గవర్నర్‌ నామినేటెడ్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా నియమించారు. గత నెలలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో  ప్రభాకర్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ రావు స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
 
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడుగా ఉన్న కర్నె ప్రభాకర్ గత ఎన్నికలలో నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే అక్కడ నుంచి టిఆర్ఎస్ తరపున కోసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.  టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ప్రభాకర్  పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో పొత్తు కారణంగా పోటీ చేయలేకపోయారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా అవకాశం దక్కలేదు.
 
  కర్నె ప్రభాకర్ స్వస్థలం సంస్థాన్ నారాయణపురం. తండ్రి జంగప్ప ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కర్నెప్రభాకర్ ప్రాథమిక విద్యాభ్యాసం సంస్థాన్ నారాయణపురంలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగింది. ఇక్కడే పదో తరగతి పూర్తి చేశారు. ఇంటర్, డిగ్రీ భువనగిరిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కళాశాలలో చదివారు. అనంతరం జర్నలిజం కోర్సు కూడా పూర్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement