'హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు' | k lakshman takes on trs govt | Sakshi
Sakshi News home page

'హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు'

Jul 28 2016 1:12 PM | Updated on Aug 11 2018 7:03 PM

'హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు' - Sakshi

'హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు'

టీఆర్ఎస్ పార్టీ పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ మండిపడ్డారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యావ్యవస్థపై టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ గురువారం హైదరాబాద్లో మండిపడ్డారు. రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గవర్నర్ ప్రమేయం లేకుండా వీసీల నియామకం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు.

వీసీల నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీలకు కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల వీసీలను నియమించింది. అయితే నియామకాలను హైకోర్టు గురువారం కోట్టివేసింది.   
 

Advertisement
 
Advertisement
Advertisement