బీసీలను మోసం చేసిన ప్రభుత్వం | k,lakshman about trs | Sakshi
Sakshi News home page

బీసీలను మోసం చేసిన ప్రభుత్వం

Dec 6 2016 9:21 AM | Updated on Sep 4 2017 9:59 PM

బీసీలను మోసం చేసిన ప్రభుత్వం

బీసీలను మోసం చేసిన ప్రభుత్వం

బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం వారిని మోసం చేసిందని లక్ష్మణ్ అన్నారు.

సాక్షి, హైదరాబాద్: వెనకబడిన తరగతుల (బీసీ) అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. వారిని మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మురళీధర్‌రావు కమిషన్ సిఫార్సుల కన్నా ఎక్కువ రిజ ర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినా వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు శూన్యమని మండిప డ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 45 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని, ఎన్నికల్లో గెలిచాక ఆ ఊసే మరిచిపోయారని విమర్శించారు.

సోమవారం పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కాటం నర్సింహయాదవ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన బడ్జెట్లలో బీసీలకు అరొకర నిధులు కేటారుుంచిందని, వాటినీ సరిగా ఖర్చు చేయలేదన్నారు. బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement