జూనియర్ ఆర్టిస్టు అరెస్టు | junior artiste arrested for burgling | Sakshi
Sakshi News home page

జూనియర్ ఆర్టిస్టు అరెస్టు

Nov 16 2016 5:59 PM | Updated on Aug 20 2018 4:44 PM

తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న యువకుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న యువకుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బండ్లగూడకు చెందిన బలిజ విక్కి అలియాస్ నంది విక్కి(25) జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తూ కృష్ణానగర్‌లో నివాసముంటున్నాడు.

జల్సాలకు డబ్బు సరిపోకపోవడంతో దొంగతనాలను మరో మార్గంగా ఎంచుకున్నాడు. గత కొన్నేళ్లుగా వివిధ ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రూ.5 లక్షలు విలువజేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 16 చోరీ కేసుల్లో విక్కి నిందితుడిగా ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement