breaking news
junior artiste
-
జూనియర్ ఆర్టిస్ట్ మానస మృతి.. అంత్యక్రియలకు డబ్బులు లేవు..
సాక్షి, జడ్చర్ల: బుల్లితెరపై చూద్దామనుకున్న తరుణంలో తన కూతురును రోడ్డు ప్రమాదం మింగేసిందని ఆ తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో శనివారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్‌లు మృత్యువాత పడిన సంఘటనలో మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిలోని పాతబజార్‌కు చెందిన మానస (21) ఉంది. చదవండి: (ఒకే కాలేజీ.. ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి..) స్థానికుల కథనం ప్రకారం.. ఈ యువతిది నిరుపేద కుటుంబం. ఆరేళ్ల క్రితం తల్లి బాలమణి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. తండ్రి రవీందర్ ఓ పెట్రోల్‌బంకులో పనిచేసేవాడు. అక్క వైష్ణవి కొరియర్ కార్యాలయంలో చిరుద్యోగిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో పదోతరగతి వరకు చదివిన మానస బుల్లితెరపై కనిపించాలన్న ఆశతో హైదాబాద్ మెట్లెక్కిందని ఈ సందర్భంగా తండ్రి వివరించాడు. షార్ట్ ఫిలింస్‌లో నటించేదని, షూటింగ్స్ లేనప్పడు ఇంటికి వచ్చేదన్నారు. చదవండి: (అసలే మత్తు.. ఆపై స్పీడు) ఇటీవల తన ఇంటిలోని ఓ గదికి మరమ్మతు చేయించి రేకులకప్పుతో పాటు కలర్స్ వేయించిందన్నాడు. ఈనెల 16వ రాత్రి తన చేతికి గాయమైన సమయంలో కట్టుకట్టి ప్రాథమిక వైద్యం చేసిందని గుర్తు చేసుకుని లబోదిబోమన్నాడు. తన కూతురు వారం రోజుల క్రితమే ఇంటికి వచ్చి తిరిగి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు బస్సులో వెళ్లిందన్నాడు. శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్న వార్త వినాల్సి వచ్చిందని బోరుమన్నాడు. తన కూతురు అంత్యక్రియలకు డబ్బులు లేవని వాపోయాడు. దాతలు స్పందించి సహకరించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ సంఘటనతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) -
జూనియర్ ఆర్టిస్టు అరెస్టు
హైదరాబాద్: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న యువకుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బండ్లగూడకు చెందిన బలిజ విక్కి అలియాస్ నంది విక్కి(25) జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తూ కృష్ణానగర్‌లో నివాసముంటున్నాడు. జల్సాలకు డబ్బు సరిపోకపోవడంతో దొంగతనాలను మరో మార్గంగా ఎంచుకున్నాడు. గత కొన్నేళ్లుగా వివిధ ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రూ.5 లక్షలు విలువజేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 16 చోరీ కేసుల్లో విక్కి నిందితుడిగా ఉన్నాడు.