గవర్నర్కు జర్నలిస్టు సంఘాల ఫిర్యాదు | journalist leaders meet governor, complain on sit notices | Sakshi
Sakshi News home page

గవర్నర్కు జర్నలిస్టు సంఘాల ఫిర్యాదు

Jun 23 2015 5:15 PM | Updated on Sep 3 2017 4:15 AM

గవర్నర్కు జర్నలిస్టు సంఘాల ఫిర్యాదు

గవర్నర్కు జర్నలిస్టు సంఘాల ఫిర్యాదు

ఓటుకు కోట్ల కేసులో ఆడియో, వీడియో టేపులను ప్రసారం చేసిన టీవీ చానళ్లకు నోటీసులు ఇవ్వడంపై జర్నలిస్టు సంఘాల నేతలు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలిశారు.

ఓటుకు కోట్ల కేసులో ఆడియో, వీడియో టేపులను ప్రసారం చేసిన టీవీ చానళ్లకు నోటీసులు ఇవ్వడంపై జర్నలిస్టు సంఘాల నేతలు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలిశారు. గవర్నర్ను కలిసిన వారిలో ఇండియన్ జర్నలిస్టు యూనియన్ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులున్నారు.

వెంటనే నోటీసులను వెనక్కి తీసుకునేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని జర్నలిస్టు సంఘాల నేతలు గవర్నర్ను కోరారు. మీడియాకు నోటీసులు ఇవ్వడం అక్రమమని, మీడియా స్వేచ్ఛపై ఆంధ్రప్రదేశ్ సర్కారు దాడిని ఖండిస్తున్నామని దేవుపల్లి అమర్ ఈ సందర్భంగా చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య  విద్వేషాలు రెచ్చగొట్టేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement