బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు | IT raid on Baahubali movie producers houses, offices in hyderabad | Sakshi
Sakshi News home page

బాహుబలి నిర్మాతల నివాసాలపై ఐటీ దాడులు

Nov 11 2016 4:38 PM | Updated on Sep 27 2018 3:37 PM

బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు - Sakshi

బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు

తెలుగు చిత్ర పరిశ్రమకు భారీ షాక్. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బడా నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది.

హైదరాబాద్ : టాలీవుడ్‌కు ఐటీ షాక్ తగిలింది. సినీ ప్రముఖులపై మరోసారి ఆదాయపు పన్ను శాఖ పంజా విసిరింది. బాహబలి చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో దాడులు  చేశారు.  జూబ్లీహిల్స్‌లోని ఆర్కా మీడియా ఆఫీస్‌తో పాటు ఇళ్లు, కార్యాలయాలపై ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
 
మధ్యాహ్న సమయంలో మెరుపు దాడులకు దిగిన అధికారులు తొలుత ఉద్యోగాలను బయటకు పంపించారు. అనంతరం అణువణువు గాలించారు. అక్కడ దొరికిన రికార్డులు, ఫైల్స్‌ , డాక్యుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.  ట్యాక్స్‌  కడుతున్నారా లేదా  అనే దానిపై ఆరా తీశారు. ప్రతిఏటా జరుగుతున్న ఆడిట్ సరిగా ఉందా లేదా అనేదాన్ని కూడా గుర్తించారు.
Advertisement
 
Advertisement
Advertisement