హాస్టల్ గదిలో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య | Intermediate student commits suicide at Hyderabad city | Sakshi
Sakshi News home page

హాస్టల్ గదిలో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య

Jun 14 2014 8:59 AM | Updated on Sep 2 2017 8:48 AM

హాస్టల్ గదిలో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య

హాస్టల్ గదిలో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ నల్లకుంటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ప్రణీత్ కమార్ రెడ్డి శనివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు.

హైదరాబాద్ నల్లకుంటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ప్రవీణ్కుమార్ రెడ్డి శనివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. బాగ్ అంబర్పేటలోని ఆ కళాశాలకు చెందిన హాస్టల్ గదిలో ప్రణీత్ కమార్ రెడ్డి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్కు చేరుకుని విద్యార్థి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు.

 

మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానసిక ఒత్తిడి కారణంగా ప్రణీత్ కమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి ప్రణీత్ కమార్ రెడ్డి స్వస్థలం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ అని పోలీసులు వెల్లడించారు. ప్రణీత్ మృతిపై అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement