హీలియం గ్యాస్‌ పీల్చుకొని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య | Hyderabad Software Engineer Found Dead In Kondapur Apartment Police Probe Suicide Note And Circumstances | Sakshi
Sakshi News home page

హీలియం గ్యాస్‌ పీల్చుకొని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

Oct 12 2026 8:47 AM | Updated on Oct 12 2026 9:47 AM

Software Engineer Commits Suicide In Hyderabad

హైదరాబాద్‌: తలకు ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టుకొని హీలియం గ్యాస్‌ పీల్చుకొని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన మేరకు.. హర్యానాకు చెందిన సౌరభ్‌ శేఖర్‌(36) మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. రాయదుర్గంలోని నాలెడ్జీసిటీలోని మై హోం భూజలో సోదరుడు లక్ష్య శేఖర్‌ వద్ద ఉంటున్నాడు.  స్నేహితులను కలిసేందుకు వెళుతున్నాని చెప్పి శనివారం సాయంత్రం బయటకు వెళ్లాడు. కొండాపూర్‌లోని రాజరాజేశ్వరీనగర్‌లోని వీవీ హైట్స్‌ లో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు వాట్సాప్‌ గ్రూపులో అదే రోజు రాత్రి మెసేజ్‌ పెట్టాడు.

 మరుసటి రోజు కుటుంబ సభ్యులు ఫోన్‌చేసినా స్పందించలేదు. ఆదివారం ఉదయం సోదరుడు వాట్సాప్‌లో పంపిన అడ్రస్‌కు వెళ్లి వాకబు చేశాడు. ఓ ఫ్లాట్‌లో తలకు ప్లాస్టిక్‌ కవర్, హీలియం సిలిండర్‌ పెట్టుకొని చనిపోయి ఉన్నాడు. గత పదేళ్లుగా అన్నం తినగానే కడుపు నొప్పి రావడం, వాంతులు అవుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎలాంటి బాధ లేకుండా చనిపోయేందుకు హీలియం గ్యాస్‌ వాడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అనారోగ్యం కారణంగా చని పోతున్నానని, మమ్మీ, పప్పాకు సారీ అని నోట్‌రాశాడు. కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement