హైదరాబాద్ మాదాపూర్లో ఓ ప్రయివేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమిత్ అనే విద్యార్థి ..
హైదరాబాద్ : హైదరాబాద్ మాదాపూర్లో ఓ ప్రయివేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమిత్ అనే విద్యార్థి హాస్టల్ గదిలోని బాత్రూమ్లో ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. సుమిత్ స్వస్థలం రాజమండ్రి. కాగా విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కళాశాల యాజమాన్యం పోలీసులకు, మృతుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.