తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు | Inter advanced supplementary examinations from today | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

May 24 2016 6:53 AM | Updated on Sep 4 2017 12:46 AM

ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 24 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆర్‌ఐవో ఎ.రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 24 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆర్‌ఐవో ఎ.రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షకు 47,308, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 30,619 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం హైదరాబాద్ జిల్లాలో 118 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా పరీక్షల నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కమిటీ కన్వీనర్‌గా ఆర్‌ఐవో ఎ.రవికుమార్, సభ్యులుగా గవర్నమెంట్ సిటీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.చంద్రకళ, కస్తూర్భా బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతిమారెడ్డి, మహబూబియా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్యామూల్‌బాబు, జూనియర్ లెక్చరర్స్ ఆర్.సత్యానందం, డి.భద్రసేన్ తదితరులు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డీవీఈవో కాశీనాథ్, ప్రభుత్వ కళాశాల సీనియర్ ప్రిన్సిపాల్ సి.హెచ్.హరీంద్రనాథ్, ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులచే కూడిన హై పవర్ కమిటీని, 4 ఫ్లయింగ్, 4 సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement