చిన్నారుల పట్ల అసభ్య ప్రవర్తన | Indecent behavior on children | Sakshi
Sakshi News home page

చిన్నారుల పట్ల అసభ్య ప్రవర్తన

Feb 14 2015 9:35 AM | Updated on Sep 2 2017 9:19 PM

రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం రాంపల్లిలోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు దారుణానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం రాంపల్లిలోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు దారుణానికి పాల్పడ్డాడు.  'ప్రేమాలయం' అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న రాంపాల్.. అక్కడ ఉన్న చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించ సాగాడు. దాంతో వేధింపులు ఎక్కువ కావటంతో ఆ చిన్నారులు ఈ విషయాన్ని చెల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై కీసర పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు అయ్యింది.

కాగా నిర్వాహకుడు రాంపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ పునరావాస కేంద్రంలో ఉన్న 11మంది హెచ్ఐవీ పాజిటివ్ చిన్నారులతో పాటు మరో 18మందిని అక్కడ నుంచి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement