'హక్కు' అడిగితే... | IKP Employees attacks collectrate | Sakshi
Sakshi News home page

'హక్కు' అడిగితే...

Nov 25 2014 3:27 AM | Updated on Sep 2 2017 5:03 PM

'హక్కు' అడిగితే...

'హక్కు' అడిగితే...

ఐకేపీ ఉద్యోగులు తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేతనాలను పెంచడంతో పాటు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు.

* తీవ్ర ఉద్రిక్తత నడుమ
* ఐకేపీ మహిళల ఆందోళన పలువురి అరెస్టు
 సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఐకేపీ ఉద్యోగులు తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేతనాలను పెంచడంతో పాటు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఐకేపీ ఉద్యోగులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు చేరుకుని ర్యాలీగా కలెక్టరేట్ ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఒకవైపు మెట్రోరైలు పనులు సాగుతుండడంతో కలెక్టరేట్ రోడ్డు ఇరుకుగా మారింది. దీంతో కలెక్టరేట్ ఎదుట ఐకేపీ ఉద్యోగులు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరుకురోడ్డు బైఠాయించడంతో లక్డీకాపూల్ రోడ్డు ట్రాఫిక్‌తో స్తంభించిపోయింది.

ఈ సందర్భంగా ఉద్యోగులు పెద్ద ఎత్తు న నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకిచ్చే వేతనాలు ఏ మూలకు సరిపోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వేత నాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు జయలక్ష్మి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement