రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 26న నిజాం కాలేజీలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్: రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 26న నిజాం కాలేజీలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మంగళవారం ఆయన రంజాన్ పండుగపై సమీక్ష నిర్వహించారు.
అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాని సూచించారు. రంజాన్ సందర్భంగా 2 లక్షల పేద ముస్లిం కుటుంబాలకు దుస్తుల పంపిణీ చేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు.