కొన్ని ఫ్రిజ్‌లో ఉంచితే ప్రమాదం! | Sakshi
Sakshi News home page

కొన్ని ఫ్రిజ్‌లో ఉంచితే ప్రమాదం!

Published Sat, Apr 18 2015 2:29 AM

కొన్ని ఫ్రిజ్‌లో ఉంచితే ప్రమాదం! - Sakshi

రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్)లో ఉంచిన ఏ వస్తువైనా కొంతకాలం పాటు చెడకుండా ఉంటుందనేది శాస్త్రీయ సిద్ధాంతం. ఇంట్లో రిఫ్రిజిరేటర్ లేని గృహాలు నేడు అరుదుగా కనిపిస్తాయి. అయితే ఫ్రిజ్ ఉంది కదా అని అందులో ఏవి పడితే వాటిని ఉంచడం ఆరోగ్యకరం కాదంటున్నారు న్యూట్రీషనిస్ట్‌లు.ముఖ్యంగా కాయగూరల్లో ఏవి ఫ్రిజ్‌ల్లో ఉంచకూడదో వారు వివరిస్తున్నారు. ప్రస్తుతం మన ఇళ్లలో  ఆహార పదార్థాలు, కూరగాయలు, వంట సరుకులు ఏవి తెచ్చినా గృహిణులు వెంటనే వాటిని ఫ్రిజ్‌లో పెట్టేందుకు అల వాటుపడ్డారు.

ముఖ్యంగా వంటకు వాడే పదార్థాలనే కాకుండా వంటలు పాడైపోకుండా ఉం డేందుకు కూడా ఫ్రిజ్‌ల్లో పెట్టడం సర్వసాధారణమైపోయింది. ఐతే ఫ్రిజ్ లో ఏయే పదార్థాలను ఉంచాలి.. ఏవి ఉం చకూడదు.. కొన్ని పదార్థాలు ప్రిజ్‌లో ఉంచితో కలిగే నష్టాలను న్యూట్రీషనిస్టులు వివరిస్తున్నారు.

 
బంగాళాదుంప
బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచితే దుంపలపై తొక్కలోని  తేమ ఆవిరై గట్టిపడిపోతుంది. ముక్కలుగా తరిగేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. లోపల ఉండే పిండి పదార్థంలోని తేమను పూర్తిగా కోల్పోతుంది. ఫలితంగా వాటితో చేసిన పదార్థాలు చప్పగా రుచీ-పచీ లేకుండా ఉండటమే కాకుండా ఉడికించడానికి.. లేదా వేయించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
 
టమాట
టమాటాలను ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉంచరాదు. అలా ఉంచడం వల్ల టమాటాలపై ఉన్న పల్చటి పొర ముడతలు పడి అందులోని సీ-విటమిన్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. దాంతో వీటిద్వారా చేసే ఆహార పదార్థాల రుచి గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి టమాటాలను గదిలోనే నిల్వ  ఉంచాలి.
 
ఉల్లిపాయలు
ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచకండి. ఎందుకంటే వాటిలోని అధిక నీటి శాతం ఫ్రిజ్ చల్లదనానికి ఐస్‌లా మారి వాటి పొరలను బాగా దగ్గరకు చేరుస్తుంది. ఇందువల్ల వాటిని వాడే సమయంలో పొరలుగా విడదీయడం కష్టమవుతుంది.
 
వెల్లుల్లి
వెల్లుల్లిని కూడా ఫ్రిజ్‌లో ఉంచరాదు. ఎందుకంటే త్వరగా మొలక మొలుస్తుంది. వీటిని ప్లాస్టిక్ కవర్లో ఉంచి రెఫ్రిజిరేట్ చేసినా ఇదే ఫలితం ఉంటుంది.
 
చిల్లీ హాట్‌సాస్

చిల్లీ హాట్‌సాస్ బాటిల్‌ను ఫ్రిజ్‌ల్లో ఉంచకూడదు. బాటిల్‌ను ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే కూడా సాస్ నిల్వ ఉండడానికి వాడిన ఫ్రిజర్వేటివ్‌లో రసాయన చర్య సంభవించి ఫంగస్ ఏర్పడుతుంది.
 
పుచ్చకాయ
పుచ్చకాయలను కానీ, కోసిన పుచ్చ దబ్బ లను కానీ ఫ్రిజ్‌ల్లో పెట్టరాదు. అలాచేస్తే దానిలోని యాంటీ ఆక్సిడెంట్ల న్నీ  చనిపోతాయి. ఇందువల్ల తియ్యగా ఉండాల్సిన పుచ్చకాయ మనకు చప్పగా తెలుస్తుంది.
 
మునక్కాడ
మునక్కాడలను(మునక్కాయలు) పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకండి. కొయ్య ముక్కల్లా తయారైపోతాయి. వీటిని సాధారణ గది ఉష్ణోగ్రతలోనే నిల్వచేయడం ఉత్తమం.
 
తేనె
తేనెను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అది తొందరగా చిక్కబిడిపోవడమే కాకుండా, స్పటికత్వాన్ని పొందుతుంది. ఆ తర్వాత దీనిని బయటకి తీసి వాడుకోవడం కష్టమవుతుంది.
 
బ్రెడ్
బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల పెలుసుగా తయారై అందులోని తేమను కోల్పోతుంది.
 
వీటిని ఫ్రిజ్‌లో ఉంచాలి

క్రీం బిస్కెట్లు, ఖరీదైన చాక్లెట్లు, కంటి చుక్కలు, చెవుల్లో వేసుకునే చుక్కలు (ఐ అండ్ ఇయర్ డ్రాప్స్), పండ్లు, ఆకు కూరలు, కొబ్బరి చిప్పలు (ఎండినవి ఉంచకండి), పాలు, పెరుగు, కొబ్బరి నీరు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. క్రీం బిస్కెట్లు, చాక్లెట్లలో నాలుగు శాతం అల్యూమినియం, నికెల్ వంటి లోహాలుంటాయి. ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్‌తో త్వరగా చర్య జరిపి అల్యూమినియం ఆక్సైడ్, నికెల్ డయాక్సైడ్‌లుగా మారుతుంటాయి. ఇలా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన వీటిని తినడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్లు వచ్చే అవకాశముంది కనుక వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది.

Advertisement

తప్పక చదవండి

Advertisement