పాతబస్తీ టు ఐసిస్: నిత్యం సంప్రదింపులు | hyderabad brothers regularly in touch with ISIS, say nia dg | Sakshi
Sakshi News home page

పాతబస్తీ టు ఐసిస్: నిత్యం సంప్రదింపులు

Jun 29 2016 11:41 AM | Updated on Oct 17 2018 5:14 PM

పాతబస్తీ టు ఐసిస్: నిత్యం సంప్రదింపులు - Sakshi

పాతబస్తీ టు ఐసిస్: నిత్యం సంప్రదింపులు

తెలంగాణ పోలీసుల సహకారంతో నగరంలోని 14 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు ఎన్‌ఐఏ ఐజీ సంజీవ్‌కుమార్ తెలిపారు.

తెలంగాణ పోలీసుల సహకారంతో నగరంలోని 14 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు ఎన్‌ఐఏ ఐజీ సంజీవ్‌కుమార్ తెలిపారు. ఎన్‌ఐఏకు చెందిన అధికారులతో పాటు మొత్తం 100 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి పాతబస్తీలో సోదాలు జరిపారు. ఈ సందర్భంగా తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇలియాస్ జగ్దానీ, మహ్మద్ ఇలియాస్ ఇబ్రహీం అనే సోదరులు సహా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఇద్దరు సోదరులే ఇక్కడి చర్యలకు కీలకంగా ఉన్నారని అనుమానిస్తున్నారు. అనుమానిత ఐఎస్ సభ్యుల నుంచి రూ.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరంతా సిరియాలోని ఐఎస్ ప్రధాన కార్యాలయంతో నిత్య సంప్రదింపులు జరుపుతున్నట్లు రూఢీ అయింది. హైదరాబాద్ నగరంలో వరుస పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్లు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement