బాలికపై ఇంటి యజమాని దారుణం | house owner who allegedly raped 13 years old girl at borabanda | Sakshi
Sakshi News home page

బాలికపై ఇంటి యజమాని దారుణం

Jul 26 2016 1:17 PM | Updated on Sep 4 2017 6:24 AM

బాలికపై ఇంటి యజమాని అత్యాచారం చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

హైదరాబాద్ : నగరంలోని బోరబండలో దారుణం చోటుచేసుకుంది. బాలికను నిర్బంధించి ఇంటి యజమాని రెండు నెలలుగా  అత్యాచారానికి పాల్పడుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది.

దీంతో బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులు మంగళవారం ఉదయం సాక్షి టీవీని ఆశ్రయించారు. సాక్షి టీవీ చొరవతో వాళ్లు షీ టీమ్ చీఫ్ స్వాతిలక్రాను కలిశారు. స్వాతి లక్రా ఆదేశం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసి నిందితుని కోసం గాలిస్తున్నారు. నిందితునిపై కఠినచర్యలు తీసుకుంటామని స్వాతి లక్రా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement