ఇందిరా పార్క్ వద్ద హోంగార్డుల ఆందోళన | home guards dharna at indra park | Sakshi
Sakshi News home page

ఇందిరా పార్క్ వద్ద హోంగార్డుల ఆందోళన

Oct 27 2016 12:51 PM | Updated on Sep 2 2018 3:08 PM

ఇందిరా పార్క్ వద్ద హోంగార్డుల ఆందోళన - Sakshi

ఇందిరా పార్క్ వద్ద హోంగార్డుల ఆందోళన

హోం గార్డులు మరోసారి ఆందోళన బాట పట్టారు.

హైదరాబాద్‌: హోం గార్డులు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఇందిరా పార్క్ వద్ద హోంగార్డులు గురువారం ఆందోళనకు దిగారు. కానిస్టేబుళ్లతో పాటు సమానంగా పనిచేస్తున్నా తమకు గుర్తింపు లేదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబపోషణ భారమవుతోందన్నారు. వెంటనే ప్రభుత్వం హోం గార్డులను పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. లేకపోతే తమ ఆందోళలను భవిష్యత్ లో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement