
శంషాబాద్ విమానాశ్రయానికి హెచ్‌ఎంటీవీ స్పెషల్ జ్యూరీ అవార్డు
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. హెచ్‌ఎం టీవీ నిర్వహించిన బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో స్పెషల్ జ్యూరీ అవార్డును దక్కించుకుంది
శంషాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. హెచ్‌ఎం టీవీ నిర్వహించిన బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో స్పెష ల్ జ్యూరీ అవార్డును దక్కిం చుకుంది. నగరంలో శని వారం రాత్రి ఏర్పాటు చేసి న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయల నుంచి జీఎంఆర్ ఎయిర్‌పోర్టు కార్పొరేట్ కమ్యూనికేషన్ హెడ్ అనిందితాదాస్, మౌలిక వసతులు, నిర్వహణ హెడ్ సంజయ్ కపర్జా అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవార్డు రావడం ఎంతో హర్షణీయమన్నారు.