రాష్ట్రంలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో గురువారం ఏకంగా 47.33 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు అయింది.
- మహబూబ్‌నగర్ జిల్లా ఐజలో 44.51 డిగ్రీలు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో గురువారం ఏకంగా 47.33 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఇంతటి స్థాయిలో ఉష్ణోగ్రతలు మార్చిలో రావడం వాతావరణశాఖనూ విస్మయానికి గురిచేస్తోంది. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా ఐజలోనూ 44.51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మిర్యాలగూడలో 42.31 డిగ్రీలు రికార్డు అయింది. రాష్ట్రంలో చాలాచోట్ల 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే వడగాల్పుల తీవ్రత పెరిగినా అధికారయంత్రాంగం మాత్రం అందుకు తగ్గ చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.