మాదన్నపేటలో భారీ బందోబస్తు | high security in madannapet over black day | Sakshi
Sakshi News home page

మాదన్నపేటలో భారీ బందోబస్తు

Dec 6 2016 4:37 PM | Updated on Sep 4 2017 10:04 PM

మానద్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా పోలీసులు మోహరించారు.

చంచల్‌గూడ: బాబ్రీ మసీదు కూల్చివేత దినం కావడంతో మంగళవారం మానద్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. సంతోష్‌నగర్ ఏసీపీ శ్రీనివాసలు పర్యవేక్షణలో మాదన్నపేట ఇన్స్‌పెక్టర్ కలింగ్ పీటర్ వత్సల రాజు ఆధ్వర్యంలో బందోబస్తును నిర్వహించారు. ఈ బందోబస్తులో 2 కంపెనీ ప్లాటూన్‌లు, ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్స్‌పెక్టర్‌లు, 12 మంది ఎస్‌లు, సిబ్బంది పాల్గొన్నట్లు ఏసీపీ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement