నేరెళ్ల ఘటనపై స్పందించిన హైకోర్టు | High Court to respond to the nerella incident | Sakshi
Sakshi News home page

నేరెళ్ల ఘటనపై స్పందించిన హైకోర్టు

Aug 22 2017 3:37 AM | Updated on Aug 11 2018 8:45 PM

నేరెళ్ల ఘటనపై స్పందించిన హైకోర్టు - Sakshi

నేరెళ్ల ఘటనపై స్పందించిన హైకోర్టు

సిరిసిల్ల జిల్లా, నేరెళ్ల, జిల్లెల, రామచం ద్రాపురం గ్రామాల దళితులను పోలీసులు చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్‌ బెజ్జారం చంద్రకుమార్‌ రాసిన లేఖపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది.

జస్టిస్‌ చంద్రకుమార్‌ లేఖ పిల్‌గా పరిగణన
సాక్షి, హైదరాబాద్‌:  సిరిసిల్ల జిల్లా, నేరెళ్ల, జిల్లెల, రామచం ద్రాపురం గ్రామాల దళితులను పోలీసులు చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్‌ బెజ్జారం చంద్రకుమార్‌ రాసిన లేఖపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఆ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)గా పరిగణించింది.

దీనిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. పోలీసులు ఉద్దేశపూర్వ కంగానే నేరెళ్ల తదితర గ్రామాలకు చెందిన 8 మంది దళితులను హింసించి, వారి హక్కులను హరించారని ఆయన లేఖలో పేర్కొన్నారు. కరీంనగర్‌ జైలులో ఉన్న బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసేలా సంబంధిత కోర్టును ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థించారు.

Advertisement
 
Advertisement
Advertisement