భానుడు భగభగ | heavy Temperature in city | Sakshi
Sakshi News home page

భానుడు భగభగ

Apr 28 2015 11:32 PM | Updated on Oct 16 2018 4:56 PM

భానుడు భగభగ - Sakshi

భానుడు భగభగ

గ్రేటర్‌పై భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం గరిష్టంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ఈ సీజన్‌లో ఇదే అత్యధికం
 

సిటీబ్యూరో:  గ్రేటర్‌పై భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం గరిష్టంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం. కనిష్టంగా 27.2 డిగ్రీలు నమోదైనట్లు  బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత వల్ల మధ్యాహ్నం వివిధ పనులకు ఇళ్ల నుంచి బయటకువెళ్లిన వారిలో కొందరు సొమ్మసిల్లారు. 

లస్సీ,ఫలుదా, కొబ్బరిబోండాలు, శీతల పానీయాలతో మరికొందరు ఉపశమనం పొందారు. ఎండ అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు గొడుగులు, క్యాప్‌లు, చలువ కళ్లద్దాలు ధరించాలని, చర్మ, కళ్ల సంరక్షణపై శ్రద్ధ చూపాలని వైద్యులు సూచిస్తున్నారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప పెరుగుదల నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement