బాణసంచా గోదాములో భారీ అగ్నిప్రమాదం | Heavy fire Accident in crackers Godown | Sakshi
Sakshi News home page

బాణసంచా గోదాములో భారీ అగ్నిప్రమాదం

Nov 10 2015 8:09 PM | Updated on Oct 2 2018 5:04 PM

దీపావళి పండుగ సంబరాల సమయంలో నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

దీపావళి పండుగ సంబరాల సమయంలో నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. క్రాకర్స్ గోదాములో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగి మంటలు ఎగసిపడ్డాయి. టపాసుల పేలుళ్లకు ఆ ప్రాంతం దద్దరిల్లింది. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. అయితే, ప్రమాద తీవ్రత, పేలుళ్లతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.



 

Advertisement
 
Advertisement
Advertisement