చిట్టీల పేరుతో హెడ్‌కానిస్టేబుల్ చీటింగ్ | head constable cheets the public | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో హెడ్‌కానిస్టేబుల్ చీటింగ్

Feb 23 2015 4:36 PM | Updated on Sep 2 2017 9:47 PM

చిట్టీల పేరుతో ఓ హెడ్ కానిస్టేబుల్ జనం నెత్తిన టోపీ పెట్టిన సంఘటన సరూర్‌నగర్‌లోని గ్రీన్‌పార్కుకాలనీలో సోమవారం వెలుగు చూసింది.

హైదరాబాద్ సిటీ (సరూర్‌నగర్): చిట్టీల పేరుతో ఓ హెడ్ కానిస్టేబుల్ జనం నెత్తిన టోపీ పెట్టిన సంఘటన సరూర్‌నగర్‌లోని గ్రీన్‌పార్కుకాలనీలో సోమవారం వెలుగు చూసింది. అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ పనిచేస్తున్న వెంకటేశ్వర్లు సరూర్‌నగర్‌లోని గ్రీన్‌పార్కు కాలనీలో అరుణ చిట్‌ఫండ్ నిర్వహిస్తున్నాడు. కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో చిట్టీలు పాడుకున్నవారికి డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. అతడ్ని నమ్మి కోట్ల రూపాయలు చిట్టీలు వేసి మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు. బాధితుల ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్యం చేశారు. ఇదేమి అన్యాయమని నిలదీసిన బాధితులపై ఎస్‌ఐ ప్రభాకర్ సర్వీసు రివాల్వర్‌తో బెదిరించాడు. ఉన్నతాధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement