హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) వైస్ ఛాన్సలర్ అప్పారావు రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్సీయూ జేఏసీ ప్రకటించింది.
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) వైస్ ఛాన్సలర్ అప్పారావు రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్సీయూ జేఏసీ ప్రకటించింది. సస్పెన్షన్‌కు గురైన మిగతా నలుగురు విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
వీసీ రాజీనామా చేసే వరకు క్లాసులు బహిష్కరిస్తామని...అడ్మినిస్ట్రేషన్ విభాగం కార్యకలాపాలు కొనసాగనివ్వమని నాయకులు తెలిపారు. హెచ్‌సీయూలో సస్పెన్షన్కు గురైన ఐదుగురు విద్యార్థుల్లో గుంటూరుకు చెందిన వేముల రోహిత్ అనే పీహెచ్‌డీ విద్యార్థి ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.