వాట్సాప్లో ఓ యువతికి అసభ్యకర మెస్సేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్న ఓ వ్యక్తిపై నల్లకుంట పోలీసులు బుధవారం నిర్భయ కేసు నమోదు చేశారు.
నల్లకుంట (హైదరాబాద్): వాట్సాప్‌లో ఓ యువతికి అసభ్యకర మెస్సేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్న ఓ వ్యక్తిపై నల్లకుంట పోలీసులు బుధవారం నిర్భయ కేసు నమోదు చేశారు. ఎస్ఐ చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. తిలక్‌నగర్‌లో నివాసముంటున్న ఓ యువతి (23) కి ఓ వ్యక్తి కొంత కాలంగా వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్నాడు.
ఈ వేధింపులు భరించలేని ఆ యువతి నల్లకుంట పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు వాట్సాప్ మెస్సేజ్‌లు పంపించిన ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడి కోసం వేట ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.