రాష్ట్రపతిని కలిసిన గవర్నర్ | governor narasimhan meets president pranab mukherjee | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతిని కలిసిన గవర్నర్

Dec 28 2015 11:21 PM | Updated on Sep 4 2018 5:07 PM

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సోమవారం పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సోమవారం పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదన చారి, మాజీ రాజ్యసభ సభ్యుడు వై.శివాజీలు వేర్వేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రపతి శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు హైదరాబాద్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement