'విజయ్ని వెంటనే విడుదల చేయాలి' | government will release Vijay immediately, demands mallu ravi | Sakshi
Sakshi News home page

'విజయ్ని వెంటనే విడుదల చేయాలి'

Nov 19 2015 2:00 PM | Updated on Jul 11 2019 8:38 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్లో నిర్వహించిన సభలో నిరసన తెలిపిన ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్లో నిర్వహించిన సభలో నిరసన తెలిపిన ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. అరెస్ట్ చేసిన విద్యార్థి విజయ్ని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

ఓయూ విద్యార్థి విజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమని పేర్కొన్నారు. నక్సలైట్ల అజెండానే అమలు చేస్తామని పేర్కొన్న కేసీఆర్.. ఎన్కౌంటర్, అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మాజీ ఎంపీ మల్లు రవి విమర్శించారు. కాగా, విజయ్ ప్రస్తుతం ఎక్కడున్నాడన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement