జయహో గోల్కొండ | Golkonda jayaho | Sakshi
Sakshi News home page

జయహో గోల్కొండ

Nov 3 2016 12:51 AM | Updated on Sep 4 2017 6:59 PM

జయహో గోల్కొండ

జయహో గోల్కొండ

అపురూప కూచిపూడి నృత్యంతో గోల్కొండ కోట పులకించింది.

గోల్కొండ: అపురూప కూచిపూడి నృత్యంతో గోల్కొండ కోట పులకించింది. తన నృత్యాభినయంతో కోట చరిత్ర, తెలంగాణలోని చారిత్ర ప్రదేశాలను దీపికారెడ్డి బృందం అద్భుతంగా ఆవిష్కరించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో దీపికారెడ్డి తన 25 మంది శిష్యులతో కలిసి చేసిన నృత్యం ప్రేక్షకులను కట్టిపడేసింది.

తొలుత జయహో గోల్కొండ నృత్య రూపకంలో కోట చరిత్ర, కుతుబ్‌షాహీల వైభవాన్ని కళ్లకు కట్టారు. తెలంగాణ వైభవంలో ఇక్కడి చారిత్రక కట్టడాల కథనాన్ని నృత్యంలో చూపారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారని ఫిక్కి హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలు పద్మరాజగోపాల్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement