ఆడపిల్లని వద్దనుకున్నారేమో! | girl child found at road | Sakshi
Sakshi News home page

ఆడపిల్లని వద్దనుకున్నారేమో!

May 18 2016 8:32 PM | Updated on Sep 4 2017 12:23 AM

తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఓ పసికందు నడిరోడ్డుపై దర్శనమిచ్చింది.

మెహిదీపట్నం : తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఓ పసికందు నడిరోడ్డుపై దర్శనమిచ్చింది. ఒక రోజు వయసున్న ఆడ శిశువును బుధవారం సాయంత్రం హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్‌నగర్‌లో రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. ఆ మార్గంలో వెళ్లేవారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని శిశువును నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ ఎస్.రవీందర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement