గ్రేటర్లో తనిఖీలు ముమ్మరం | GHMC Commissioner speaks over arrangements for Greater elections | Sakshi
Sakshi News home page

గ్రేటర్లో తనిఖీలు ముమ్మరం

Jan 21 2016 7:28 PM | Updated on Sep 3 2017 4:03 PM

గ్రేటర్లో తనిఖీలు ముమ్మరం

గ్రేటర్లో తనిఖీలు ముమ్మరం

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్లో గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... 997 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతో పాటు 2700 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

వాహనాల తనిఖీల్లో రూ.32 లక్షల 36 వేలు, స్టాటిక్ సర్వే లైన్స్ సోదాల్లో కోటి రూపాయల వరకు నగదు పట్టుబడిందని ఆయన తెలిపారు. గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement