మహిళా కిడ్నాపర్ల నుంచి చిన్నారులకు విముక్తి | Gang of kidnappers busted in Hyderabad | Sakshi
Sakshi News home page

మహిళా కిడ్నాపర్ల నుంచి చిన్నారులకు విముక్తి

Jun 20 2014 12:49 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ నగరంలో చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం రట్టు చేశారు.

హైదరాబాద్ నగరంలో చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠా గుట్టును నల్గొండ పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. కిడ్నాప్ ముఠాలోని ఆరుగురు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురిలో అయిదుగురు మహిళా కిడ్నాపర్లు ఉన్నారు.  కిడ్నాపర్ల చెరలో ఉన్న ఏడుగురు చిన్నారులను పోలీసులు రక్షించారు. సైబరబాద్, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో చిన్నారులను టార్గెట్గా చేసుకుని ఆ ముఠా కిడ్నాప్ లకు పాల్పడుతుందని పోలీసులు వెల్లడించారు.



ఆయా నగరాలలో గత 3 నెలలుగా చిన్నారులను ఆ ముఠా కిడ్నాప్లు చేస్తుందని పోలీసులు తెలిపారు. కిడ్నాపైన చిన్నారుల్లో ఆరుగురు హైదరాబాద్ నగరానికి చెందిన వారు కాగా, ఒకరు విజయవాడకు చెందిన వారని పోలీసులు వివరించారు. కిడ్నాపైన చిన్నారులను వారివారి తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు నల్గొండ పోలీసులు వెల్లడించారు. కిడ్నాపర్లంతా నల్గొండ జిల్లావారని వారిని నేటీ సాయంత్రం మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే కిడ్నాపర్లలో ఐదుగురు మహిళలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement