చిన్నపాటి గొడవ.. 20 కత్తిపోట్లు! | function hall owner murdered by his neighbour in hyderabad | Sakshi
Sakshi News home page

చిన్నపాటి గొడవ.. 20 కత్తిపోట్లు!

Jan 29 2017 7:21 AM | Updated on Sep 5 2017 2:21 AM

చిన్నపాటి గొడవ.. 20 కత్తిపోట్లు!

చిన్నపాటి గొడవ.. 20 కత్తిపోట్లు!

చిన్నపాటి గొడవ కారణంగా ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.

హైదరాబాద్‌: చిన్నపాటి గొడవ కారణంగా ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. బహదూర్‌పురా రామ్నాస్‌పురా ప్రాంతానికి చెందిన మన్సూర్‌ ఖాన్‌(42) జూపార్కు సమీపంలో ఖాజా ఫంక్షన్‌ హాల్‌ను నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికే చెందిన ఖాలేద్‌ పిల్లలు, మన్సూర్‌ ఖాన్‌ పిల్లలతో గొడవ పడేవారు. ఈ చిన్నపాటి గొడవలు వారిద్దరి మధ్య తీవ్రస్థాయికి చేరాయి. అంతేకాక మన్సూర్‌ ఖాన్‌ ఆర్థికంగా ఎదుగుతుండటాన్ని ఖాలేద్‌ జీర్ణించుకోలేకపోయాడు.

వీరి మధ్య ఉన్న గొడవలను దృష్టిలో పెట్టుకుని శనివారం మధ్యాహ్నం ఖాజా ఫంక్షన్‌ హాల్‌కు కొద్ది దూరంలో ఖాలేద్‌ తన అనుచరులతో కలిసి మన్సూర్‌ఖాన్‌పై కత్తులతో మూకుమ్మడిగా దాడి చేశాడు. ఈ దాడిలో 20 చోట్ల కత్తిపోట్లకు గురైన మన్సూర్‌ఖాన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. సంఘటన స్థలాన్ని చార్మినార్‌ ఏసీపీ అశోక్‌ చక్రవర్తి, అదనపు ఇన్‌స్పెక్టర్‌ గురునాయుడు, క్లూస్‌ టీమ్‌ సభ్యులు పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఎస్సై రవి కుమార్‌ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement