రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సిద్ధమవ్వాలి: కవిత | fro telangana state we need support from seemandhra ,says kavitha | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సిద్ధమవ్వాలి: కవిత

Aug 7 2013 2:35 AM | Updated on Sep 1 2017 9:41 PM

రాష్ర్ట విభజనకు సీమాంధ్ర నా యకులు మానసికంగా సిద్ధమవ్వాలని తెలంగాణ జాగృ తి ఆధ్యక్షురాలు కె.కవిత అన్నారు.

రాష్ర్ట విభజనకు సీమాంధ్ర నా యకులు మానసికంగా సిద్ధమవ్వాలని తెలంగాణ జాగృ తి ఆధ్యక్షురాలు కె.కవిత అన్నారు. మల్లాపూర్ నోమా కళ్యాణమండపంలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ జాగృతి ఏడో వార్షికోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ‘తిరుపతి వెంకన్నతో మాకూ అనుబంధం ఉంది. అంతమాత్రాన ఆయన హుండీలో వాటా అడుగుతున్నామా? మరి సీమాంధ్రులు హైదరాబాద్‌లో వాటా ఎలా అడుగుతారు’ అని కవిత ప్రశ్నించారు. 
 
 సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక విభాగం కన్వీనర్  కోధారి శ్రీను రచించిన ‘జయహో జాగృతి’ పాటల సీడీ, ‘గమ్యం.. గమనం’ పుస్తకం, ‘తెలంగాణ జాగృతి’ మాస పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ జాగృతి కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా కవిత, చైర్మన్‌గా పానిపర్తి తిరుపతిరావు, ప్రధానకార్యదర్శిగా రాజీవ్‌సాగర్‌లను ఎన్నుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement