క్యాన్సర్, కిడ్నీ రోగులకు నెలవారీగా ఉచిత మందుల కిట్ | Sakshi
Sakshi News home page

క్యాన్సర్, కిడ్నీ రోగులకు నెలవారీగా ఉచిత మందుల కిట్

Published Wed, Jun 29 2016 12:45 AM

క్యాన్సర్, కిడ్నీ రోగులకు నెలవారీగా ఉచిత మందుల కిట్

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: క్యాన్సర్, కిడ్నీ, మధుమేహం, బీపీ వంటి సమస్యలతో బాధపడే రోగులకు నెలకు సరిపడా మందులను ఒక కిట్‌గా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించి నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. కుటుంబ సంక్షేమ కార్యక్రమా లు, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్(ఎన్‌యూహెచ్‌ఎం)ల పనితీరుపై మంగళవారం ఇక్కడ ఆయన వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ  దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించారు.  క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే నివారించడానికి వీలుం టుందన్నారు.

మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి కేంద్రాలు అన్ని వసతులతో సిద్ధంగా ఉంచాలన్నారు. రాష్ట్రంలో 500 ప్రసూతి కేంద్రాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశితస్థాయిలో ఆధునీకరించాలని సూచిం చారు. గ్రేటర్ పరిధిలోని 127 ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు, 13 సామాజిక ఆరోగ్య కేంద్రాల పరిపాలన బాధ్యతలను జీహెచ్‌ఎంసీకి అప్పగించాలని నిర్ణయించామన్నా రు. పారిశుద్ధ్యం, మంచినీరు వంటి సమస్యలను సులువుగా అధిగమించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement