శంషాబాద్‌లో భారీగా నగదు పట్టివేత | foreign currency seized at Rajiv Gandhi International Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో భారీగా నగదు పట్టివేత

Sep 20 2016 8:22 PM | Updated on Sep 4 2017 2:16 PM

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి వెళుతున్న ఓ ప్రయాణికుడి నుంచి డీఆర్‌ఐ (డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి వెళుతున్న ఓ ప్రయాణికుడి నుంచి డీఆర్‌ఐ (డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పాతబస్తీకి చెందిన అహ్మద్ నుంచి భారత కరెన్సీలో రూ.10 కోట్లు విలువ చేసే విదేశీ కరెన్సీ ఉన్నట్లు ముందస్తు సమాచారం తెలుసుకున్న అధికారులు సోమవారం తెల్లవారుజామున అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతడిని డీఆర్‌ఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement