రివ్వుమంటూ రిహార్సల్స్... | Flying Rehearsals | Sakshi
Sakshi News home page

రివ్వుమంటూ రిహార్సల్స్...

Mar 15 2016 12:22 AM | Updated on Oct 2 2018 7:37 PM

రివ్వుమంటూ రిహార్సల్స్... - Sakshi

రివ్వుమంటూ రిహార్సల్స్...

ఈ నెల 16 నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయంలో జరిగే ఏవియేషన్ ఎగ్జిబిషన్‌లో భాగంగా లోహ విహంగాలు గగనంలో రిహార్సల్స్ చేశాయి.

హైదరాబాద్: ఈ నెల 16 నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయంలో జరిగే ఏవియేషన్ ఎగ్జిబిషన్‌లో భాగంగా లోహ విహంగాలు గగనంలో రిహార్సల్స్ చేశాయి. నాలుగు విమానాలు వాయువేగంతో నింగి వైపు దూసుకుపోయి విభిన్న ఆకృతులను ఆవిష్కరించి అద్భుత విన్యాసాలకు తెరలేపాయి.

ఏవియేషన్ షోకు ముందే బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతవాసులు ఈ విన్యాసాలను తిలకించి ఆనందపారవశ్యులయ్యారు. కాగా ఏవియేషన్ నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాలకు చెందిన సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే మంగళవారం రాత్రి, బుధవారం మధ్యాహ్నం వరకు వివిధ కంపెనీల విమానాలు కూడా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement