అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం | fire accident in malakpet | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

Oct 21 2015 6:38 PM | Updated on Sep 5 2018 9:45 PM

హైదరాబాద్లోని ఓ అపార్ట్‌మెంట్‌లో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది.

మలక్‌పేట: హైదరాబాద్లోని ఓ అపార్ట్‌మెంట్‌లో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని అస్మాన్‌ఘడ్‌లోని అంజనాద్రి అపార్ట్‌మెంట్ ప్లాట్ నెం. 301లో భారీ ఎత్తున మంటలు రావడంతో స్థానికులు ఫైర్స్టేషన్, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్లాట్లో రిటైర్డ్ ఉద్యోగి అంజయ్య కుటుంబం నివాసం ఉంటున్నారు.

అంజయ్య కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం సైదాబాద్‌లో గుడికి వెళ్ళారు. వెళ్ళిన కొద్దిసేపటికి ఇంట్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో వాచ్‌మెన్ వెంటనే పోలీసులకు, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వంటగదిలో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్థమైంది. సుమారు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. గ్యాస్ స్టౌవ్ ఆన్ చేసి కట్టివేయడం మరచిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement