అమీర్‌పేటలో అగ్నిప్రమాదం | Fire accident in Jewellery shop at Ameerpet | Sakshi
Sakshi News home page

అమీర్‌పేటలో అగ్నిప్రమాదం

Feb 22 2016 6:35 AM | Updated on Sep 3 2017 6:11 PM

అమీర్‌పేట్‌లోని గురుద్వార్‌ వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ జ్యువెలరీ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్‌: అమీర్‌పేట్‌లోని గురుద్వార్‌ వద్ద ఓ నగల దుకాణంలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. గణేష్ జుయెలర్స్‌లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దాంతో అప్రమత్తమైన అక్కడి కాపలా సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్‌సర్క్యూటే మంటలకు కారణమని భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement