breaking news
gurudwar
-
నిన్న తిరుమల, నేడు గురుద్వార్.. మీరు మారరా?
బాలీవుడ్లో సన్నీడియోల్, అమీషా పటేల్ నటిస్తున్న 'గదర్-2' వివాదానికి దారి తీసింది. ఈ సినిమాలో సిక్కుల పవిత్ర స్థలం అయిన గురుద్వారాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఆ సీన్లలో ముద్దు సన్నివేశాలతో పాటు కౌగిలింతలకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ సంఘటన వల్ల గురుద్వారా నిర్వాహకులతో పాటు సిక్కు మతస్థులు చిత్ర యూనిట్‌పై ఫైర్ అవుతున్నారు. దేవుడిని నమస్కరించే సీన్ షూట్ చేస్తామని చెప్పి అనుమతులు తీసుకున్నారని గురుద్వారా మేనేజర్ సత్బీర్ సింగ్, సెక్రటరీ శివ కన్వర్ సింగ్ తెలిపారు. (ఇదీ చదవండి: కుటుంబ పోషణ భారమై డ్రైవర్‌గా మారిన హీరో? నిజమేంటంటే?) కొన్నిరోజుల క్రితం తిరుపతిలో కృతిసనన్ చెంపపై ఓం రౌత్ ముద్దు పెట్టడం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరిచిపోక ముందే ఇదే తరహాలో మరోకటి జరగడంతో ఛీ.. ఛీ దేవాలయాల్లో ఇవేం పనులు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. కనీసం వారు క్షమాపణలు చెబితే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు. ఇక పోతే, తెలుగులో అమీషా పటేల్ పవన్ సరసన 'బద్రి'తో మెప్పించింది. ఆ తరువాత మహేష్‌తో నాని, ఎన్టీఆర్‌తో నరసింహుడులో నటించిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్) -
మేం భారతీయులం కామా?
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడితో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కశ్మీరీ విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోషల్ మీడియాలోనూ, స్థానికంగానూ కశ్మీరీలకు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారం నేపథ్యంలో డెహ్రాడూన్, అంబాలా, ముల్లానా కాలేజీల్లోనూ, యూనివర్సిటీల్లోనూ చదవుకొంటోన్న వందలాది మంది కశ్మీరీ విద్యార్థులు హాస్టళ్ళు ఖాళీ చేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. బెదిరింపులు, హెచ్చరికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల సర్పంచులు, స్థానికులు 24 గంటల్లోగా ఖాళీ చేసి వెళ్ళాలని హెచ్చరించడంతో ముల్లానా, డెహ్రాడూన్ లనుంచి పంజాబ్‌లోని లాంద్రాన్కి వచ్చిన వందమంది కశ్మీరీ విద్యార్థులకు స్థానిక గురుద్వారాలు ఆశ్రయం ఇచ్చి, వారికి వసతి, భోజనసదుపాయాలు సమకూర్చాయి. అదేవిధంగా 70 మంది విద్యార్థులకు జమ్మూకశ్మీర్ స్టుడెంట్స్ ఆర్గనైజేషన్ (జెకెఎస్ఓ) లాంద్రాన్లో తాత్కాలికంగా ఆశ్రయం కల్పించింది. లాంద్రాన్కి వచ్చిన వారిలో కొంత మంది మంగళవారం కశ్మీర్‌కి వెళ్ళిపోయారు. ప్రభుత్వం కశ్మీర్ విద్యార్థుల రక్షణ బాధ్యతను తీసుకుంటుందనీ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. లాంద్రాన్, సోహానా ప్రాంతాల్లో పోలీసు వాహనాలను మోహరించినట్టు మొహలీ సీనియర్ పోలీసు అధికారి హరిచరణ్ సింఘ్ భుల్లార్ వెల్లడించారు. సొహానా గురుద్వారాలో కశ్మీరీ విద్యార్థులకు ఆశ్రయం కల్పించిన గురుద్వారాకి చెందిన అమరీందర్ సింగ్ మాట్లాడుతూ విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని, కశ్మీరీలైనంత మాత్రాన వాళ్ళు తప్పు చేసినట్టు కాదనీ, ఎక్కడైనా చెడ్డవాళ్ళు ఉంటారనీ, అంతమాత్రాన అందరినీ అదేగాటన కట్టాల్సిన పనిలేదనీ వ్యాఖ్యానించారు. పుల్వామాలో జరిగిన దాడి ముమ్మాటికీ తప్పేననీ, అంతమాత్రాన విద్యార్థులను టార్గెట్ చేయడం కూడని పని అని విద్యార్థులు ఆశ్రయం పొందుతోన్న గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ మాజీ అధ్యక్షుడు సంత్ సింఘ్ అభిప్రాయపడ్డారు. డెహ్రాడూన్ లోని ప్రైవేటు విద్యాసంస్థలో చదువుతూ అక్కడి నుంచి పారిపోయి వచ్చి మొహలీలో ఆశ్రయం పొందుతోన్న సమీర్ అనే విద్యార్థి డెహ్రాడూన్‌లో తనకూ, తన తోటి విద్యార్థులకూ జరిగిన చేదు అనుభవాలను మీడియాకి వెల్లడించారు. అద్దెకి ఉంటోన్న తమ ఇంటి ఎదుట కొందరు కశ్మీర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రదర్శన నిర్వహించినట్టు అతను తెలిపారు. కొందరు ఆందోళన కారులు తమ ఇంటి తలుపులపై దబ దబా బాదుతూ బయటి రావాలంటూ దుర్భాషలాడినట్టు వెల్లడించారు. దీంతో భయపడిపోయి రెండు రోజుల పాటు ఇంట్లోనే దాక్కున్నట్టు చెప్పారు. మరో ఘటనలో 12 మంది కశ్మీరీ విద్యార్థులపై స్థానికులు భౌతిక దాడికి దిగారని తెలిపారు. కొన్ని షాపుల యజమానులు ఏకంగా షాప్ ఎదుటే ‘కశ్మీరీలకు అనుమతి లేదు’’ అంటూ, ఇంకా తీవ్రమైన పదజాలంతో బోర్డులు పెట్టుకున్నారని విద్యార్థులు తెలపారు. మరో విద్యార్థి తమ ఇంటి యజమానులు సైతం తమ ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో భయంతో అక్కడి నుంచి పారిపోయి పోలీసుల ఆశ్రయం పొందినట్టు వివరించారు. కొందరు ఇంటి యజమానులు మాత్రం విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేసారని, వీరి గదులకు తాళాలు వేసి కశ్మీరీ విద్యార్థులు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు ఆందోళన కారులకు చెప్పినట్టు వివరించారు. కశ్మీర్లో చాలా సంఘటనలు జరుగుతున్నాయి, అక్కడ ప్రశాంతత కొరవడింది, అందుకే చదుకోవడానికి పంజాబ్ వచ్చామని చండీగఢ్‌లో చదువుతోన్న అద్నాన్ అనే విద్యార్థి వెల్లడించారు. నిజానికి ఎటువంటి రక్తపాతాన్నీ తాము అంగీకరించబోమనీ, పుల్వామా దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామనీ స్పష్టం చేశారు. అయితే కశ్మీర్ వాస్తవ్యులం కావడమే మేం చేసిన నేరంగా భావిస్తున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. మాకు అక్కడా, ఇక్కడా, దేశంలో ఎక్కడా రక్షణ లేకుండాపోయిందనీ, ఇంకెక్కడికి వెళ్ళాలంటూ ప్రశ్నించారు. ఆ విద్యార్థి తన ఐడెంటిటీ కార్డుచూపిస్తూ ఇది నేను భారతీయుడినని నిర్ధారిస్తోంది. కానీ మేము కశ్మీర్ విద్యార్థులం అని తెలియడంతో మమ్మల్ని నేరస్తులుగా చూస్తున్నారనీ, వేధింపులకు గురిచేస్తున్నారనీ వాపోయారు. -
అమీర్‌పేటలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: అమీర్‌పేట్‌లోని గురుద్వార్ వద్ద ఓ నగల దుకాణంలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. గణేష్ జుయెలర్స్లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దాంతో అప్రమత్తమైన అక్కడి కాపలా సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్‌సర్క్యూటే మంటలకు కారణమని భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.