డెకరేషన్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం | Fire accident in decoration godown | Sakshi
Sakshi News home page

డెకరేషన్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

Nov 12 2015 1:15 PM | Updated on Sep 5 2018 9:45 PM

వనస్థలిపురంలోని పనామా వద్ద డెకరేషన్ గోదాంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: వనస్థలిపురంలోని పనామా వద్ద డెకరేషన్ గోదాంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలార్పుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. భద్రత సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement