పెళ్లి విందులో గొడవ | fighting between bride and groom relatives | Sakshi
Sakshi News home page

పెళ్లి విందులో గొడవ

Mar 2 2015 11:32 PM | Updated on Sep 2 2017 10:11 PM

సాఫీగా సాగిపోవాల్సిన పెళ్లి విందు కాస్తా రణరంగంగా మారింది.

హైదరాబాద్: సాఫీగా సాగిపోవాల్సిన పెళ్లి విందు కాస్తా రణరంగంగా మారింది. వధువు, వరుడు తరఫు బంధువులు  గొడవకు దిగి ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మల్లికార్జుననగర్‌కు చెందిన ప్రసాద్(25), అంబర్‌పేట్ కు చెందిన స్వప్న(23) తొమ్మిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరువర్గాల మద్య రాజీ కుదరడంతో ఆదివారం గోపాల్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో పెళ్లి విందు ఏర్పాటు చేశారు. విందులో ఇరువర్గాల మధ్య మొదలైన చిన్న వివాదం చివరికి గొడవకు దారిసింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. దీంతో సోమవారం ఇరువర్గాల వారు మల్కాజిగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement