మహిళా సమస్యలపై పోరాడదాం-వైఎస్సార్‌సీపీ | Fight on women's issues | Sakshi
Sakshi News home page

మహిళా సమస్యలపై పోరాడదాం-వైఎస్సార్‌సీపీ

Jul 3 2016 4:32 PM | Updated on May 25 2018 9:20 PM

రాష్ట్రంలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అందరం ఒక్కటై ముందుకు సాగుదామని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్షురాలు అమత సాగర్ తెలిపారు.

 రాష్ట్రంలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అందరం ఒక్కటై ముందుకు సాగుదామని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్షురాలు అమత సాగర్ తెలిపారు. ఆదివారం లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల పదవులు పొందిన మహిళా నాయకురాళ్లు పలువురు అమత సాగర్‌ను కలిసి అభినందనలు చెప్పారు.

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలో తాను అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పారు. ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగిన వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వనజా, పుష్పలత, జాయింట్ సెక్రటరీ న్నేహ, రాష్ట్ర కార్యదర్శి సూర్య కుమారి, రాష్ట్ర కార్యాలయ మహిళా విభాగం ఇన్‌చార్జ్ రాగ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement