ఈఎస్‌ఐ ఆస్పత్రి త్వరలో నాచారం తరలింపు | ESI hospital shifts to nacharam soon | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐ ఆస్పత్రి త్వరలో నాచారం తరలింపు

Mar 10 2016 9:50 PM | Updated on Sep 3 2017 7:26 PM

రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈఎస్‌ఐ సనత్‌నగర్ ఆస్పత్రిని నాచారం తరలింపు ఖాయమైంది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈఎస్‌ఐ సనత్‌నగర్ ఆస్పత్రిని నాచారం తరలింపు ఖాయమైంది. ఈ మేరకు ఈఎస్‌ఐ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య గురువారం ఎంవోయూ కుదిరింది. అయితే ఈ విషయాన్ని 12న కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంయుక్తంగా ప్రకటించే అవకాశం ఉంది. సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ మెడికల్ కళాశాల నిర్వహణ కోసం రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిని కార్పొరేషన్‌కు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నాచారం ఆస్పత్రిని రాష్ట్ర కార్మికశాఖకు అప్పగించనున్నారు. ఈ మేరకు సనత్‌నగర్ ఆస్పత్రిలో విధులు నిర్వహించే ఉద్యోగులు త్వరలో నాచారం ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement